Share News

గిగ్ వర్కర్స్ ర్యాలీలో పింక్ ర్యాపిడో డ్రైవర్ లలిత స్కూటీపై రాహుల్ గాంధీ

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:37 PM

గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లలిత అనే పింక్ బైక్ ర్యాపిడో డ్రైవర్.. స్కూటీపై ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

గిగ్ వర్కర్స్ ర్యాలీలో పింక్ ర్యాపిడో డ్రైవర్ లలిత స్కూటీపై రాహుల్ గాంధీ
rahul gandhi on pink rapido

హైదరాబాద్, నవంబర్ 13: గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత, హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పింక్ డ్రైవర్ లలిత అనే మహిళ స్కూటీ నడుపుతుండగా.. రాహుల్ వెనుక కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.


‘రాహుల్ గాంధీ లాంటి లీడర్‌ను నా బైక్ మీద తీసుకెళ్లే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని వందల మంది గిగ్ వర్కర్స్ ర్యాలీకి వచ్చారు. రాహుల్ గాంధీని కలిస్తే చాలు అనుకున్నాను.. కానీ ఆయన్ను నా బైక్ తీసుకెళ్లడం.. పెద్ద అచీవ్‌మెంట్‌లా భావిస్తున్నాను. దాదాపు పది నిమిషాల పాటు రాహుల్ గాంధీ నా బైక్ మీద కూర్చున్నారు. కూర్చోగానే హలో.. అంటూ నన్ను పలకరించారు. మా కుటుంబ వివరాలతో పాటు గిగ్ వర్కర్‌గా నా జర్నీ గురించి అడిగి తెలుసుకున్నారు. పింక్ బైక్ రాపిడో వల్ల నాకు ఈ అవకాశం వచ్చినట్లు ఆయనకు వివరించాను.

గత కొన్నేళ్లుగా నేను పింక్ బైక్ రాపిడోలో వర్క్ చేస్తున్నా. గిగ్ వర్కర్ల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి రుణపడిఉంటాం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అంటూ ర్యాపిడో డ్రైవర్ లలిత.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదు.. కేటీఆర్ ఘాటు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 03:56 PM