ఉస్మానియా యూనివర్సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Nov 18 , 2026 | 10:40 AM
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు (బుధవారం) ఆకస్మిక తనిఖీలు చేశారు. నాణ్యతలేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు (బుధవారం) ఆకస్మిక తనిఖీలు చేశారు. నాణ్యతలేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న (మంగళవారం) రాత్రి సమయంలో గిన్నెలు తట్టి విద్యార్థినులు నిరసన తెలిపారు. వారి నిరసనతో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.
హాస్టల్ కిచెన్‌లోకి వెళ్లి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆ గదిలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై తనిఖీలు చేశారు. వంట చేసే పరిసరాలు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. హాస్టల్‌లో విద్యార్థినులకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై ఆరా తీశారు.
ఆహార భద్రత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై హాస్టల్ నిర్వహణకు సూచనలు చేశారు. నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. విద్యార్థినుల ఫిర్యాదుల నేపథ్యంలో హాస్టల్ భోజన నాణ్యతపై అధికారులు తనిఖీలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సమ్మక్క సాగర్ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు
సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News