అక్రమంగా అండాల సేకరణ కేసు.. మరోకరి అరెస్ట్
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:33 AM
కొంతమంది మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించిన కేసులో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రతినిధి మూరెళ్ల నరసింహారావును జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కొంతమంది మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించిన కేసులో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రతినిధి మూరెళ్ల నరసింహారావును జూబ్లీహిల్స్ పోలీసులు ఈరోజు (ఆదివారం) అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పేద మహిళలకు డబ్బుల ఆశ చూపించి అండాలను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ వైద్యా , ఆరోగ్య శాఖ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
బేగంపేట హాస్టల్‌లో ఉండే వివిధ రాష్ట్రాల్లోని మహిళల ద్వారా పలు సంతాన సాఫల్య కేంద్రాల నుంచి అండాలను సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ హాస్టల్‌పై వైద్యాధికారులు దాడులు జరిపి 12 మంది మహిళలకు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. డీఎంహెచ్‌వో డా. పుట్ల శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News