Share News

హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:50 PM

హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆస్పత్రి షెల్టర్ రూమ్‌లో నర్సు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

 హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి
Hyderabad Nurse Case

హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆస్పత్రి షెల్టర్ రూమ్‌లో నర్సు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి(21)గా గుర్తించారు. ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలతో నర్సు మృతదేహం పడి ఉంది.


సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గత 8 నెలలుగా ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో ఆ యువతి నర్సుగా పనిచేస్తోంది. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం డ్యూటీకి ఆమె రాకపోవడంతో అనుమానంతో గదిని ఆస్పత్రి సిబ్బంది పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు నిన్న (శనివారం) అర్ధరాత్రి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.


ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఉద్యోగాల పేరుతో మోసం.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై చీటింగ్ కేసు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 05:10 PM