Share News

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:11 PM

ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కి ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరయ్యారు.

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం
Nidhhi Agerwal

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కి (Nidhhi Agerwal) ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు (బుధవారం) ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రచారం చేశారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రచారంపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జీత్ విన్ సహా మరికొన్ని బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేశారు. నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్ ప్రమోషనల్ కాంట్రాక్ట్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.


బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ యాప్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ బ్యాంకు అకౌంట్‌లోకి నగదు వచ్చాయని అధికారుల విచారణలో తేలింది. డిపాజిట్ అయిన లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ విచారణను నిధి అగర్వాల్ ఎదుర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ అనర్థాలు తెలియక ప్రమోట్ చేశానని సీఐడీకి గతంలో నిధి అగర్వాల్ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.


వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 01:53 PM