ముందు సింహాలు.. వెనుక మంత్రి సీతక్క.. షాకింగ్ వీడియో వైరల్!
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:21 PM
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క సింహాలతో సవారీ చేసిన వీడియో చూస్తే గూస్‌బమ్స్ రావడం ఖాయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ గిరిజన బిడ్డ ఆఫ్రికా సింహాలతో ఓ సింహంలా నడుస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 13: బోన్‌లో ఉన్న సింహాలను చూస్తేనే ఒకింత భయపడిపోతాం.. అలాంటిది జంగిల్‌లో సింహాలు కనిపిస్తే అంతే సంగతి. కానీ, తెలంగాణ మంత్రి సీతక్క సింహాలతో కలిసి నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్ర మంత్రి సీతక్క ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారు. అక్కడ లయన్ సఫారీలో పర్యటించిన ఆమె.. సింహాలతో కలిసి నడిచారు. రెండు సింహాలు ముందు నడుస్తుండగా.. వాటి వెనుకాలే సీతక్క నడుచుకుంటూ వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క..
దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి మంత్రి సీతక్క అక్టోబర్ 1న దక్షిణాఫ్రికా వెళ్లారు. పది రోజుల పర్యటనలో మంత్రి పలు ప్రదేశాలను సందర్శించారు. అక్టోబర్ 2 న పీటర్ మారిట్జ్‌బర్గ్‌లోని గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని.. నివాళి అర్పించారు. అనంతరం మంత్రి దక్షిణాఫ్రికాలో అమలవుతున్న వ్యవసాయ విధానాలను, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం.. సౌత్ ఆఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. తెలుగు మహిళలతో బతుకమ్మ ఆడారు. దానితోపాటు దక్షిణాఫ్రికా అడవుల్లో సంచరించి.. సింహాలతో సఫారీ చేశారు. పర్యటన ముగించుకున్న సీతక్క అక్టోబర్ 11న తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం
ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం
మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News