Share News

సారీ.. సర్వర్‌ డౌన్‌..!

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:03 AM

గ్రేటర్‌ హైదరాబాద్‏లోని మీ సేవ కేంద్రాల్లో సర్వర్‌ మొరాయిస్తోంది. ఉదయం నుంచి రాత్రివరకు ఇదే పరిస్థితి ఉంటుండడంతో వివిధ పనులపై వెళ్లిన పౌరులు, విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

సారీ.. సర్వర్‌ డౌన్‌..!
MeeSeva server down

  • మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ఇబ్బందులు

  • స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు విద్యార్థుల పరేషాన్‌

  • గడువు తేదీని పొడిగించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

చందానగర్‌(హైదరాబాద్): గ్రేటర్‌ హైదరాబాద్‏లోని మీ సేవ కేంద్రాల్లో సర్వర్‌ మొరాయిస్తోంది. ఉదయం నుంచి రాత్రివరకు ఇదే పరిస్థితి ఉంటుండడంతో వివిధ పనులపై వెళ్లిన పౌరులు, విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. సర్వర్‌ ఎప్పుడు పనిచేస్తుందో తెలియక గంటల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలకు ఇటీవల తరలివెళ్తున్నారు.


కాగా, దరఖాస్తుకు చివరితేదీ ఈ నెల 25 వరకు మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టుకుని సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్కాలర్‌షి్‌పనకు దరఖాస్తు చేయాలంటే ముందుగా మీ సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పూర్తి చేసుకోవాలి. తర్వాత ఆన్‌లైన్‌ సెంటర్స్‌లో దరఖాస్తును అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వారం రోజుల నుంచి మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ సర్వర్‌ అందుబాటులోకి రాకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.


city6.2.jpgఉదయం నుంచి రాత్రి వరకు వేచిచూస్తున్నా.. సర్వర్‌ రాకపోవడంతో నిరుత్సాహంతో ఇంటికి వెళ్తున్నారు. దీనిపై మీ సేవ సిబ్బందిని అడిగితే తమకు ఏమీ తెలియదని, పైనుంచి వస్తేనే తాము చేస్తామని సమాధానం చెబుతున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌

నీళ్లడిగితే రాజకీయం అంటారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 11:08 AM