నీళ్లడిగితే రాజకీయం అంటారా?
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:06 AM
నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? జూరాల ప్రాజెక్టు కింద సాగుకు నీళ్లివ్వమంటే.. తాగునీటి కోసం దాచిపెడుతున్నామని అంటున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తోంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు.
జూరాల కింద పంటలకు నీళ్లు ఇవ్వకుంటే
రైతులు నష్టపోరా?: రాంచందర్‌రావు
నీళ్లడిగితే రాజకీయం అంటారా?
జూరాల కింద నీళ్లివ్వకుంటే రైతులు నష్టపోరా?: రాంచందర్
జడ్చర్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? జూరాల ప్రాజెక్టు కింద సాగుకు నీళ్లివ్వమంటే.. తాగునీటి కోసం దాచిపెడుతున్నామని అంటున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తోంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు చేపడుతున్న పోరాటానికి మద్దతుగా వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు వద్దకు వెళుతూ మహబూబ్‌నగర్ జిల్లా గొల్లపల్లిలోని ఓ హోటల్ వద్ద రాంచందర్‌రావుతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం అంతా సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జూరాల ప్రాజుక్టు కింద సాగుచేసిన పంటలకు నీళ్లివ్వబోమనడం దుర్మార్గం అని మండిపడ్డారు. నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎగువన ఉన్న కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల్లో 97.4ు నీటి నిల్వ ఉన్నదని, అందులో 5 టీఎంసీల నీళ్లు వదిలితే ఇక్కడి పంటలకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారని, జిల్లా రైతులను ఆదుకునే బాధ్యత ఆయనదేనన్నారు. కాగా, కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంత ప్రాజెక్టుల్లో నీరున్నా పంటలు ఎండబెడతారా? అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇంత మూర్ఖపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని దుయ్య బట్టారు.