Share News

హోర్ముజ్ సమీపంలో పేలుళ్లు.. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు బాగున్నాయన్న ట్రంప్..

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:53 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్‌ క్వెషమ్‌ దీవి వద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

హోర్ముజ్ సమీపంలో పేలుళ్లు.. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు బాగున్నాయన్న ట్రంప్..
Strait of Hormuz Explosion

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్‌ క్వెషమ్‌ దీవి వద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. పేలుళ్లకు కారణం ఏమిటనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌ ప్రతినిధులతో అమెరికా అధికారులు జరిపిన చర్చలు చాలా బాగున్నాయని తెలిపారు (Strait of Hormuz Explosion).


న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగినట్లు ట్రంప్ తెలిపారు. దీనిని ఆయన చాలా మంచి సమావేశంగా అభివర్ణించారు. త్వరలోనే మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ కూడా ఇరాన్ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిగినట్లు వెల్లడించారు. మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగినట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు (Donald Trump Iran).


అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్న సమయంలోనే హోర్ముజ్ జలసంధి సమీపంలో పేలుళ్లు జరిగినట్టు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది (Qeshm Island Explosion). అయితే పేలుళ్ల వెనుక కారణం, వాటి వల్ల జరిగిన నష్టం లేదా ప్రాణనష్టంపై తక్షణ సమాచారం అందుబాటులో లేదు. ఈ పేలుళ్ల నేపథ్యంలో మళ్లీ ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా అనే ఆందోళన అంతర్జాతీయ వ్యాప్తంగా నెలకొంది.


ఇవి కూడా చదవండి..

భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..


రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Sep 23 , 2026 | 10:03 AM