Share News

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

ABN , Publish Date - Sep 14 , 2026 | 08:32 AM

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుష్కరిణిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
Padagaya Pushkarini

కాకినాడ జిల్లా: వినాయక చవితి వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాదగయ పుష్కరిణిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. పిఠాపురం మండలం కొత్త కందరాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున దర్శనం నిమిత్తం పాదగయకు వెళ్లారు.


దర్శనానికి ముందు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పుష్కరిణిలో దిగారు. అయితే, ప్రమాదవశాత్తూ సాయి (22) అనే యువకుడు గల్లంతయ్యాడు. స్నానం చేస్తుండగా కాలు జారడంతో లోపలికి పడిపోయాడు. స్థానికులు, యువకుడి స్నేహితుల సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ వేళ ఆలయ పుష్కరిణిలో యువకుడు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.


ఈ వార్తలు కూడా చదవండి

విఘ్ననాశాయా.. వినాయకాయా..

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: మంత్రులు లోకేశ్, అనిత..

Updated Date - Sep 14 , 2026 | 08:32 AM