Share News

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: మంత్రులు లోకేశ్, అనిత..

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:57 AM

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ప్రజల జీవితాల్లో గణనాథుడు విఘ్నాలు తొలగించి విజయాలను అందించాలని వారు ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: మంత్రులు లోకేశ్, అనిత..
Vinayaka Chavithi 2026

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ప్రజల జీవితాల్లో గణనాథుడు విఘ్నాలు తొలగించి విజయాలను అందించాలని వారు ఆకాంక్షించారు. లంబోదరుడి దీవెనలతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నిండాలని కోరుకున్నారు. అందరి జీవితాల్లో శుభాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. పండుగ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు సూచించారు.


మంత్రి నారా లోకేశ్ ఎక్స్ పోస్టు..

‘వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన దేవుడు గణనాథుడు.. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగించి, విజయాలను అందించాలని కోరుకుంటున్నాను. ఎల్‌నినో ఆందోళనలను పటాపంచలు చేస్తూ విఘ్న వినాయకుడు భారీ వర్షాలను తీసుకొచ్చాడు. గతేడాది మాదిరిగానే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అందరూ వినాయక చవితి జరుపుకోవాలి. జై బోలో గణేశ్ మహారాజ్‌కి జై’ అంటూ మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.


అందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలి..

ఏపీ ప్రజలందరికీ హోంమంత్రి అనిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే పర్వదినమే వినాయక చవితి అని కొనియాడారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు, శుభాలు కలగాలని కోరుకున్నారు. పండుగ వేళ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా అందరూ మట్టి వినాయకుడిని పూజిద్దామని, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంట్లో వినాయక ప్రతిష్ఠ చేస్తున్నారా? ఈ నియమాలు తప్పక తెలుసుకోండి..

శ్రీ వినాయక వ్రతకథ

Updated Date - Sep 14 , 2026 | 07:57 AM