Share News

విఘ్ననాశాయా.. వినాయకాయా..

ABN , Publish Date - Sep 14 , 2026 | 08:20 AM

ఈ వినాయక చవితి మీ ఇంట సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, విజయాలు నింపాలని.. మీరు చేపట్టే ప్రతి పనిలో గణనాథుడి ఆశీస్సులు ఉండాలని.. మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని.. మీ జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు మీ సొంతం కావాలని కోరుకుంటూ.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పాఠకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

విఘ్ననాశాయా.. వినాయకాయా..
Vinayaka Chavithi 2026

ఇంటర్నెట్ డెస్క్: ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా పూజించేది విఘ్నేశ్వరుడినే. ముందుగా గణపతిని పూజిస్తే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. జ్ఞానం, విజయం, ఐశ్వర్యం, శుభాన్ని ప్రసాదించే గణనాథుడిని భక్తిశ్రద్ధలతో కొలిచే పవిత్రమైన పర్వదినమే వినాయక చవితి. దేశవ్యాప్తంగా భక్తులు గణేశుడిని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ.. ఇళ్లలో భక్తి వాతావరణాన్ని, వీధుల్లో సందడిని తీసుకొస్తుంది. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం, వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం, భక్తి పాటలు, భజనలతో గణనాథుడిని స్మరించడం మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకుంటాయి.

వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. మనలోని చెడు ఆలోచనలను తొలగించి, మంచి మార్గంలో నడవాలని చెప్పే ఆధ్యాత్మిక సందేశం కూడా. గణనాథుడి రూపమే మన జీవితానికి ఎన్నో విలువైన పాఠాలను అందిస్తుంది. గణపతికి ఉన్న పెద్ద చెవులు ఇతరుల మాటలను ఓపికగా వినాలని, చిన్న కళ్లు ఏకాగ్రతతో ముందుకు సాగాలని, పెద్ద పొట్ట మంచి-చెడులను జీర్ణించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని బోధిస్తాయి.

ఈ వినాయక చవితి మీ ఇంట సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, విజయాలు నింపాలని.. మీరు చేపట్టే ప్రతి పనిలో గణనాథుడి ఆశీస్సులు ఉండాలని.. మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని.. మీ జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు మీ సొంతం కావాలని కోరుకుంటూ.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పాఠకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

Updated Date - Sep 14 , 2026 | 08:20 AM