Share News

బీఎండబ్ల్యూ కార్ల ధరల పెంపు!

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:55 AM

లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా మరోసారి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు...

బీఎండబ్ల్యూ కార్ల ధరల పెంపు!

ప్రారంభ ధర రూ.1.95 కోట్లు

మార్కెట్లోకి 7 సిరీస్‌ కార్లు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రణ్‌వీర్‌ సింగ్‌

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా మరోసారి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా సీఈఓ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు. ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం, రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమే ధరల పెంపునకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే ఈ ఏడాదిలో మూడు దఫాల్లో ధరలను సుమారు 4-5 శాతం వరకు పెంచింది. మరోవైపు బీఎండబ్ల్యూ ఇండియా సరికొత్త 7 సిరీస్‌ కార్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ పరిచయం చేస్తూ ఈ సరికొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో బీఎండబ్ల్యూ 740ఎం స్పోర్ట్‌, ఐ7 ఈడ్రైవ్‌50 ఎంస్పోర్ట్‌, ఐఎం70 ఎక్స్‌ డ్రైవ్‌ ఉన్నాయి. వీటి ధరలు రూ.1.95 కోట్ల నుంచి రూ.2.65 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి.

ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 12 , 2026 | 05:55 AM