సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2023-01-29T01:32:41+05:30 IST

సంక్షేమాభి వృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సురేష్‌ అన్నారు. పెద్దారవీడులో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి సురేష్‌ శనివారం ప్రారంభించారు.

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పెద్దారవీడు, జనవరి 28: సంక్షేమాభి వృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సురేష్‌ అన్నారు. పెద్దారవీడులో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి సురేష్‌ శనివారం ప్రారంభించారు. తొలుత భోగేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సురేష్‌ మాట్లాడు తూ సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీ తంగా అర్హులకు అందజేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సచి వాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. జగన్‌ పాద యాత్రలో ఇచ్చిన హామీ నవరత్నాల ద్వారా ఇప్పటికి 95 శాతం హామీలను ప్రభుత్వం అమలుజేస్తోందన్నారు. అనంతరం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్య క్రమంలో ఎంపీపీ బెజవాడ పెద్దగురవ య్య, జడ్పీటీసీ సభ్యుడు యేరువ చలమారెడ్డి, సర్పంచ్‌ దుగ్గెం చెన్నమ్మ, వైసీపీ మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణా రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఉడుముల శ్రీనివాస రెడ్డి, వైస్‌చైర్మన్‌ డి.కాశయ్య, వైసీపీ నాయకులు అళ్లు వెంకటేశ్వరరెడ్డి(డీలర్‌), కాసు వెంకటరెడ్డి, మాజీసర్పంచ్‌ బత్తుల సాలెయ్య, ఎంపీటీసీ రాజనారాయణమ్మ, పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T01:32:44+05:30 IST