Share News

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 06:25 AM

గణేశ నిమజ్జన శోభాయాత్రను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మద్యం విక్రయాలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌
Liquor Shops Closed

  • శాంతి భద్రతల పరిరక్షణకే నిర్ణయం

  • మద్యం మత్తులో విఘాతం కలిగించేవారిపై పోలీసు నిఘా

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : గణేశ నిమజ్జన శోభాయాత్రను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మద్యం విక్రయాలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని వైన్‌ షాపులు, బార్లు, క్లబ్‌లను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షల ప్రకారం.. తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో గణేశ్‌ నిమజ్జనం ప్రారంభమయ్యే బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి.


నిజామాబాద్‌లో మంగళవారంనాడే వైన్‌ షాపులు బంద్‌ చేశారు. ఇక హైదరాబాద్‌ పరిధిలో శుక్రవారం వైన్‌ షాపులు బంద్‌ ఉండనున్నాయి. మద్యం మత్తులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణేశ్‌ విగ్రహాల తుది నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ నెల 25న మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాల్సి ఉంటుంది. అయితే స్టార్‌ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫైర్‌ సేఫ్టీపై నిర్లక్ష్యానికి వైద్యమేది?

అనని మాటలు కాదు.. కాంగ్రెస్‌ నేతలు అన్నమాటలే

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 06:25 AM