మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Sep 19 , 2026 | 08:56 AM
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. టాటా ఏస్ వాహనాన్ని డీసీఎం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనకు ముందుగా టాటా ఏస్ వాహనాన్ని టైర్ పంక్చర్ అయింది. ఈ క్రమంలో టైర్ మారుస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. మృతులను నాచారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే శామీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి
ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News