Share News

హైదరాబాద్‌లో భారీ చోరీ.. కిలో బంగారు ఆభరణాలు మాయం

ABN , Publish Date - Jul 20 , 2026 | 10:48 AM

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడి దాదాపు కిలో బంగారు ఆభరణాలను అపహరించారు.

హైదరాబాద్‌లో భారీ చోరీ.. కిలో బంగారు ఆభరణాలు మాయం
Hyderabad Gold Theft

హైదరాబాద్, జులై 20 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడి దాదాపు కిలో బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ -10లో ఉన్న గురుకృప ఎక్స్‌పోర్ట్స్ కార్యాలయంలో ఈ చోరీ జరిగింది. కార్యాలయంలోని లాకర్‌లో భద్రపరిచిన 1028.59 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. చోరీకి గురైన వాటిలో 7 బంగారు నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఆభరణాలను డైమండ్ ఫిక్సింగ్ పనుల కోసం ప్రత్యేకంగా లాకర్‌లో భద్రపరిచారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కార్యాలయాన్ని పరిశీలించారు. వాష్‌రూమ్ కిటికీని ధ్వంసం చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.


అనంతరం లాకర్‌ను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వ్యాపారి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిలోకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురికావడం నగరంలో సంచలనంగా మారింది. నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ

గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్

టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కి ఈశ్వరమ్మ లేఖ.. ఎందుకంటే

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 12:44 PM