Share News

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు

ABN , Publish Date - May 01 , 2026 | 06:40 AM

హైదరాబాద్‌ పాతబస్తీలో గల బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ జూ పార్క్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు
Hyderabad Fire Accident

హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బహదూర్‌పురాలోని నెహ్రూ జూ పార్క్ సమీపంలో ఉన్న ఓ భారీ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాములో ప్లాస్టిక్, టైర్లు, ఇతర వస్తువులు ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే బహదూర్‌పురా పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


గోదాములోని విద్యుత్ వైరింగ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. లక్షల రూపాయల విలువైన స్క్రాప్ వస్తువులు కాలిబూడిదయ్యాయని సమాచారం. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం నెహ్రూ జూ పార్క్‌కు అతి సమీపంలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 06:48 AM