హైదరాబాద్‌లో అధిక వడ్డీ ఆశ చూపి రూ.3.62 కోట్లు స్వాహా.. నిందితుడు అరెస్ట్
ABN , Publish Date - Nov 06 , 2026 | 09:07 PM
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.4 కోట్ల చిట్‌ఫండ్ మోసం కేసులో ప్రధాన నిందితుడు గుడిశెట్టి సుధాకర్ (50) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.4 కోట్ల చిట్‌ఫండ్ మోసం కేసులో ప్రధాన నిందితుడు గుడిశెట్టి సుధాకర్ (50) ను పోలీసులు అరెస్ట్ చేశారు. 48 మంది బాధితుల నుంచి రూ.3.62 కోట్లు వసూలు చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అధిక వడ్డీ, భారీ లాభాల ఆశ చూపి నిందితుడు డబ్బులు వసూలు చేశాడు.
2021 నుంచి 2024 వరకు చిట్టీల పేరుతో వసూల్లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 2024 నుంచి డబ్బులు చెల్లించకుండా అదృశ్యమైనట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. నవంబరు 5వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు శంకర్‌పల్లి పోలీసులు తరలించారు. నిందితుడి భార్య లక్ష్మి, ఇతరుల పాత్రపైనా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News