Share News

కిషన్ రెడ్డి అహంకారపూరిత మాటలను ఖండిస్తున్నాం: ఎంపీ మల్లు రవి

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:19 PM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

కిషన్ రెడ్డి అహంకారపూరిత మాటలను ఖండిస్తున్నాం: ఎంపీ మల్లు రవి
MP Mallu Ravi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) తీవ్రంగా ఖండించారు. సీఎంను నోరుమూసుకుని కూర్చోమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అహంకారపూరిత మాటలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే కిషన్ రెడ్డికి విలువ లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్‌తో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు.


భారతదేశం ఐక్యంగా ఉండాలని ఇద్దరు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ప్రాణత్యాగం చేశారని ఎంపీ గుర్తుచేశారు. భారతదేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎంపీ హెచ్చరించారు. పార్లమెంట్‌లో తమ గళం వినిపిస్తామన్నారు. ఇలానే జరిగితే తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాలంటే టూ థర్డ్ మెజారిటీ కావాలని ఎంపీ మల్లు రవి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్

పోలీసులను ఆశ్రయించిన ఐటీఎస్ మహిళా డైరెక్టర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 04:19 PM