Share News

తండ్రికి తగ్గ తనయుడు.. లోకేశ్‌కు హార్దిక శుభాకాంక్షలు: మంత్రి నారాయణ

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:17 PM

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్‌కు మంత్రులు నారాయణ, అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు పార్టీని మరోవైపు తన శాఖను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ లోకేశ్ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.

తండ్రికి తగ్గ తనయుడు.. లోకేశ్‌కు హార్దిక శుభాకాంక్షలు: మంత్రి నారాయణ
Minister Narayana

అమరావతి, ఏప్రిల్ 15: తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన లోకేశ్‌‌కు(Nara Lokesh) మంత్రి నారాయణ(Minister Narayana) అభినందనలు తెలియజేశారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కొనియాడారు. ఒకవైపు పార్టీని మరోవైపు తన శాఖను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రిగా తన శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడేందుకు లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయని తెలిపారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాల కల్పనకు దేశ విదేశాల నుంచి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ నాయకత్వం, ఆలోచనలతో తెలుగుదేశం పార్టీకి మరింత శక్తి వస్తుందనడంలో సందేహం లేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


లోకేశ్‌కు శుభాకాంక్షలు: హోం మంత్రి అనిత

anitha-poor-family.jpg

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్‌కు హోం మంత్రి అనిత(Home Minister Anitha) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విధేయత, అనుభవం, కష్టపడే తత్వమే ప్రాతిపదికగా.. సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ ప్రకటించిన నూతన కమిటీలు.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన పల్లా శ్రీనివాస్, పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ హోం మంత్రి అనిత ప్రత్యేక అభినందనలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

విషాదం.. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి

జగన్ పాదం పడితే సముద్రం కూడా విషపూరితం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 03:23 PM