యువనేత కృషి.. పూర్తి న్యూ లుక్‌తో టీడీపీ కమిటీలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:18 PM
గత కొంత కాలంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లను పార్టీలోని కీలక స్థానాలకు తీసుకెళ్తానని లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటను నిజం చేస్తూ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌కు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించేలా యువ నేత కృషి చేశారు.
అమరావతి, ఏప్రిల్ 15: తెలుగుదేశం పార్టీ కమిటీల కూర్పులో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) మార్క్ చూపించారు. పూర్తి కొత్త లుక్‌తో పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లను పార్టీలోని కీలక స్థానాలకు తీసుకెళ్తానని లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటను నిజం చేస్తూ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌కు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించేలా యువనేత కృషి చేశారు. పార్టీ వ్యవస్థల్లో కలగా మిగిలిపోయే పదవులను సామాన్య కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొచ్చారు లోకేశ్. ‘పని చెప్పేవారి కంటే.. పని చేసేవారికి పార్టీలో పెద్ద పీట’ అంటూ యువనేత సంకేతాలిచ్చారు.
కడప మహానాడు నుంచి పార్టీలో కీలక మార్పులకు యువనేత శ్రీకారం చుట్టారు. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదంతో ఏడాది కాలంగా పార్టీని కొత్త తరహాలో పరుగులు పెట్టిస్తున్నారు లోకేశ్. ఈ నినాదాన్ని పార్టీ విధానంగా మార్చుకునేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించి సక్సెస్ సాధించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే తన ఐడియాలను అమలు చేసి పార్టీకి ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కృషి చేసిన సామాన్య కార్యకర్తలకు మాత్రమే వేదిక మీద స్థానం కల్పించారు లోకేశ్. కార్యకర్తలకు సంక్షేమం అందిస్తూనే, పని చేసిన వారికి మాత్రమే పదవులు ఇచ్చే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేలా లోకేశ్ వ్యూహాలు రచించారు.
భవిష్యత్తులో పార్టీకి కొత్త నాయకత్వాన్ని అందించేందుకు మంత్రి లోకేశ్ కృషి చేశారు. కమిటీల్లో యువతకు సముచిత స్థానం దక్కేలా చేయడంలో ఆయన చొరవ చూపారు. రాజకీయ నేపథ్యం లేకుండా పార్టీ కోసం పని చేసిన వారిని, విధేయులైన సామాన్య కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీనియర్ల సూచనలు, జూనియర్ల దూకుడుతో పార్టీని సమర్థవంతంగా నడిపేలా లోకేశ్ వ్యూహాలు రచించారు.
ఇవి కూడా చదవండి...
డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్
Read Latest AP News And Telugu News