‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:34 AM
పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై చర్చను వీక్షించేందుకు ఏపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 15: మహిళా బిల్లును(నారీ శక్తి వందన్ అధినియమ్) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) ఈరోజు(బుధవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరిగే ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశం, చర్చను వీక్షించేందుకు హోం మంత్రి అనితతో పాటు మహిళా మంత్రులు సవిత, సంధ్యారాణి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హోం మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు అనిత పేర్కొన్నారు. బిల్లుపై చర్చ అనంతరం ఏప్రిల్ 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి ధన్యవాదాలు తెలియజేయనున్నారు మహిళా నేతలు.
ఇవి కూడా చదవండి...
డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్
Read Latest AP News And Telugu News