Share News

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Apr 15 , 2026 | 10:39 AM

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
AP Inter results

అమరావతి, ఏప్రిల్ 15: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(బుధవారం) ఉదయం మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు అయ్యింది. గత 12 ఏళ్లలో అత్యధికంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 77 శాతం పాస్ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులు 81 శాతం పాస్‌తో రెండో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ‘Hi’ మెసేజ్‌ను 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో పంపితే కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.


ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీన కళాశాలల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరం జీజేసీల్లో 68 శాతం పాస్ అయ్యారు. ఇది గత 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణతగా నమోదు అయింది. విద్యార్థులు, ప్రిన్సిపల్స్, లెక్చరర్ల సమిష్ఠి కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అకడమిక్ ఎక్సలెన్స్ కోసం అందరూ కలిసి కృషి చేయడం ఫలించిందని ప్రశంసించారు.


అమ్మాయిలే టాప్

  • ఇంటర్‌ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారు.

  • ద్వితీయ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 85%

  • ప్రథమ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 81%

గ్రూప్ వైజ్ ఫలితాలు

  • MPC గ్రూప్‌లో 84% (1వ సంవత్సరం)

  • BiPC లో 83% (2వ సంవత్సరం)

  • CEC, HEC గ్రూపుల్లో తక్కువ పాస్ శాతం

జిల్లాల వారీగా టాప్

  • కృష్ణా జిల్లా – 92% (2వ సంవత్సరం)

  • గుంటూరు – 88%

  • ఎన్టీఆర్ జిల్లా – 87%

  • SPSR నెల్లూరు – 82%


రీకౌంటింగ్

  • రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తులు: ఏప్రిల్ 20 నుంచి 27 వరకు

  • స్కాన్ కాపీతో రీవెరిఫికేషన్‌కు అవకాశం

సప్లిమెంటరీ పరీక్షలు

  • మే 21 నుంచి జూన్ 4 వరకు థియరీ పరీక్షలు

  • జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్

  • రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ

ముఖ్య సూచనలు

  • మొదటి సంవత్సరం పాస్ అయిన వారికి ఇంప్రూవ్‌మెంట్‌కు ఛాన్స్

  • ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పూర్తి పరీక్షలు రాయాలి


నిరాశ చెందవద్దు: మంత్రి లోకేశ్

ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తిరిగి కృషి చేసి విజయం సాధించాలని వారికి పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక బలం ఇవ్వాలని, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విజయాలు సాధించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

850 లోక్‌సభ సీట్లు!

డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 12:23 PM