వైఎస్ జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్
ABN , Publish Date - Apr 15 , 2026 | 09:12 AM
సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సీపీఆర్వో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి, ఏప్రిల్15: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో) పి.శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసానికి వెళ్తున్న ఆయన్ని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రక్తచరిత్ర అంటూ కత్తి పట్టినట్లు ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో శ్రీహరి పోస్ట్ చేశారు. దీనిపై చిత్తూరులో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీహరి ప్రస్తుతం వైసీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు
For More AP News And Telugu News