Share News

పోలీసులను ఆశ్రయించిన ఐటీఎస్ మహిళా డైరెక్టర్

ABN , Publish Date - Apr 15 , 2026 | 10:33 AM

ఓ వ్యక్తి తన ఇంటి ముందుకు వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఐటీఎస్ మహిళా డైరెక్టర్ ఫిర్యాదు చేశారు.

పోలీసులను ఆశ్రయించిన ఐటీఎస్ మహిళా డైరెక్టర్
Banjara Hills Police Station

హైదరాబాద్, ఏప్రిల్ 15: బంజారాహిల్స్ పోలీసులను ఇండియన్ టెలికాం సర్వీస్(ITC) మహిళా డైరెక్టర్ ఆశ్రయించారు. తన ఇంటి మీదకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సుతాన్ ఎస్పీ అనే వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఐఏఎస్-ఐపీఎస్ క్వార్టర్స్‌లో బాధితురాలు ఒంటరిగా నివసిస్తున్నారు. సుతాన్ ఎస్పీ తన ఇంటి వద్దకు వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడని, అసభ్యంగా సిగ్నల్స్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు.


ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలను ఆధారాలుగా ఫిర్యాదులో జత పరిచారు టెలికాం డైరెక్టర్. ఇంటి ముందు సుతాన్ ఎస్పీ న్యూసెన్స్ క్రియేట్ చేసి నానా హంగామా చేశాడని బాధితురాలు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

850 లోక్‌సభ సీట్లు!

డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 10:58 AM