Share News

విషాదం.. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి

ABN , Publish Date - Apr 15 , 2026 | 01:08 PM

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో నలుగురు మృతి చెందారు.

విషాదం.. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి
Gas Explosion

శ్రీ సత్య సాయి జిల్లా, ఏప్రిల్ 15: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టు పక్కల వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.


గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

యువనేత కృషి.. పూర్తి న్యూ లుక్‌తో టీడీపీ కమిటీలు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 01:49 PM