Share News

జగన్ పాదం పడితే సముద్రం కూడా విషపూరితం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ABN , Publish Date - Apr 15 , 2026 | 02:51 PM

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్ట్‌లు ప్రకటించి.. వైసీపీ రాజకీయ లాభం చూసుకుందని మండిపడ్డారు.

జగన్ పాదం పడితే సముద్రం కూడా విషపూరితం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Minister Anam Ramanarayana Reddy

అమరావతి, ఏప్రిల్ 15: మత్స్యకారుల విశ్వాసం కోల్పోయిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జువ్వలదిన్నెలో అడుగుపెట్టే హక్కు లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అసంపూర్తి హార్బర్‌ను ఎన్నికల కోసం వర్చువల్‌గా ప్రారంభించిన జగన్ ఓ మోసకారి అంటూ విమర్శించారు. విద్యుత్, నీరు, గోదాములు లేకుండా హార్బర్‌ను జాతికి ఎలా అంకితం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్ట్‌లు ప్రకటించి.. వైసీపీ రాజకీయ లాభం చూసుకుందని మండిపడ్డారు. వెలుగొండ, హంద్రీ-నీవా లాగే జువ్వలదిన్నె హార్బర్ కూడా కేవలం వర్చువల్ ప్రారంభం మాత్రమే అని మంత్రి తెలిపారు.


మత్స్యకార యువత ఉపాధిని దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆరోపించారు. సాగర్ డిఫెన్స్ టెక్నాలజీతో మత్స్యకారులకు సముద్రంలో మరింత భద్రత లభిస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ కృషితో మత్స్య సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 11 సీట్లు మాత్రమే ఉన్న జగన్.. 164 సీట్లు గెలిచిన ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేని జగన్.. ప్యాలెస్‌లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడుకోవాలని అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


నెల్లూరు జిల్లాలో జగన్ రెడ్డి 'గన్ కల్చర్', 'తెరల చాటు రాజకీయం' సాగనివ్వమని మంత్రి హెచ్చరించారు. గతంలో మత్స్యకారులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది అంటూ విరుచుకుపడ్డారు. కూటమి హయాంలోనే రామాయపట్నం, మూలపేట పోర్టుల పనులు వేగవంతం అయ్యాయని చెప్పారు. ‘జగన్ పాదం పడితే సముద్రం కూడా విషపూరితమవుతుంది.. మత్స్యకారులు జాగ్రత్త’ అని అన్నారు. అభివృద్ధి రథచక్రాల కింద వైసీపీ అరాచక శక్తులు నలిగిపోవడం ఖాయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

యువనేత కృషి.. పూర్తి న్యూ లుక్‌తో టీడీపీ కమిటీలు

విషాదం.. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 02:57 PM