కొండా సుస్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారు: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Aug 22 , 2026 | 06:33 PM
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంటే చూస్తూ ఊరుకోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కొండా సుస్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారని అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సుస్మిత వ్యాఖ్యల వీడియోను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కొండా సుస్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారని అన్నారు. అనిరుధ్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హద్దు మీరలేదని చెప్పారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌పై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారు: మల్లు రవి

కొండా సురేఖ విషయంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. కొండా సురేఖ వివరణ చదివామని తెలిపారు. కొండా సుస్మిత మాటల వీడియోలను చూశామని చెప్పారు. ముఖ్యమంత్రిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. మంత్రి సురేఖ వివరణపై మరోసారి సమావేశం కావాలని భావించామన్నారు. క్రమశిక్షణ కమిటీకి మరి కొందరు ఎమ్మెల్యేలు మరిన్ని వివరాలు ఇస్తామన్నారని చెప్పారు.
చిన్నారెడ్డి విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో మాట్లాడతాం: మల్లు రవి
అలాగే, చిన్నారెడ్డి వివరణ లేఖ చదివామని మల్లు రవి అన్నారు. చిన్నారెడ్డి వ్యాఖ్యల వీడియోలు చూశామని తెలిపారు. చిన్నారెడ్డి విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో మాట్లాడతామని అన్నారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు, మేఘారెడ్డి ఫిర్యాదుకు చాలా అంతరం ఉందని చెప్పారు.
రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడిన అంశాలు నాకు తెలుసు: మల్లు రవి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడిన అంశాలు తనకు తెలుసు అని.. కానీ ఒక ప్రాసెస్ ప్రకారం విచారణ ఉంటుందని మల్లురవి తెలిపారు. ఆయా వ్యక్తులపై తమకు ఎలాంటి అభిప్రాయం ఉండదని చెప్పారు. పార్టీనే తమ మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిని ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేశాం: మల్లు రవి
ఆదిలాబాద్ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ వివరణ లేఖ తమకు అందిందని మల్లురవి తెలిపారు. తన వ్యాఖ్యలపై కంది శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారని అన్నారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిని ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేశామని చెప్పారు. కంది శ్రీనివాస్ రెడ్డి అంశాన్ని సైతం మరోసారి కూర్చొని మాట్లాడతామని మల్లురవి పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News