Share News

అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా

ABN , Publish Date - Nov 05 , 2026 | 02:25 PM

హైదరాబాద్‌లో మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పష్టం చేశారు. నిందితుల దగ్గర హార్మోన్ల ఇంజక్షన్స్ గుర్తించామని, కానీ మహిళలకు వాటిని ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియదని తెలిపారు.

అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా
Malkajgiri CP Sumathi

హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi) స్పష్టం చేశారు. నిందితుల దగ్గర హార్మోన్ల ఇంజక్షన్స్ గుర్తించామని, కానీ మహిళలకు వాటిని ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియదని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ కేసు గురించి కీలక విషయాలను మీడియాకు సీపీ సుమతీ ఈరోజు (గురువారం) వెల్లడించారు.


అండాల డొనేషన్ కోసం ఏఆర్టీ సెంటర్ ద్వారానే ఫెర్టిలిటి సెంటర్‌కు సమాచారం వస్తుందని సీపీ సుమతీ చెప్పుకొచ్చారు. ఏఆర్‌టీ నుంచి అన్నిరకాల డాక్యుమెంట్‌లు సేకరించిన తర్వాత మిగతా ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో మూడు ఆస్పత్రుల పాత్ర ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మూడు ఫెర్టిలిటి సెంటర్‌లపై సోదాలు చేశామని చెప్పారు. 22 ఫెర్టిలిటీ సెంటర్‌లతో ఏఆర్‌టీ సెంటర్‌లకు లింకులు ఉన్నాయని.. వీటి గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు. మహిళలకు పెళ్లి కాకపోయినా జరిగినట్లుగా, భర్త లేకున్నా ఉన్నట్లుగా చెప్పి అండాలను సేకరించారని సీపీ సుమతీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 03:32 PM