స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు సరికాదు.. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఖండిస్తున్నాం: ఏలేటి
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:34 PM
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాత మధు అలా మాట్లాడటం సరికాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మధు మాట్లాడిన భాషను బీజేపీ ఎమ్మెల్యేలమంతా ఖండిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈరోజు(సోమవారం) శాసనసభలో మాట్లాడుతూ.. స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాత మధు అలా మాట్లాడటం సరికాదన్నారు. మధు మాట్లాడిన భాషను బీజేపీ ఎమ్మెల్యేలమంతా ఖండిస్తున్నామని చెప్పారు. అపోజిషన్ లీడర్ కేసీఆర్ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాత మధు కావాలని అలా మాట్లాడారా? లేక ఎవరైనా మాట్లాడించారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించి తాతా మధును బర్తరఫ్ చేయాలన్నారు.
22A పై స్వయంగా మంత్రి క్షమాపణలు చెప్పారని... 22 ఏ నెపాన్ని అధికారులపై మోపుతామంటే ఊరుకోమని ఏలేటి అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని వెల్లడించారు. దీనిపై సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా అని ప్రశ్నించారు. ఒకవేళ జరిగితే పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూ.. ఆ నివేదికలను బయటపెట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. మధును డిస్మిస్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News