ఆర్టీసీ విలీనం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మహేశ్‌గౌడ్
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:50 AM
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అఫ్జల్‌గంజ్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్, సీబీఎస్‌లో టిడబ్ల్యూయు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 97 డిపోల్లో జరుగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో టిడబ్ల్యూయుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ మద్దతిస్తున్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టిడబ్ల్యూయు) బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కార్మికులను కోరారు. టిడబ్ల్యూయు అధ్యక్షుడు మొగిళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ యూనియన్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఈ.అశ్వత్థామరెడ్డిని ప్రకటించారు. ఈ సభలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
రాహుల్ పోరాటానికి మద్దతుగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష
రేపే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు
Read Latest AP News And Telugu News