రేపే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:46 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో సుమారు దశాబ్ద కాలం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
ఎన్నికల బరిలో 12 సంఘాలు..
మొత్తం 35 వేల మంది ఓటర్లు
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం..
17న ఫలితాల వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో సుమారు దశాబ్ద కాలం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్యారేజీలు, డిపోలు, కార్యాలయాలు కలుపుకొని సుమారు 100కుపైగా యూనిట్లలో 120కిపైగా ఓటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో 12 సంఘాలు నిలిచాయి. సుమారు 35 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి రాష్ట్ర గుర్తింపు సంఘానికి, మరో ఓటు స్థానిక గుర్తింపు సంఘానికి వేయాల్సి ఉంటుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరుస్తారు. ఈ నెల 14, 15న పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తారు. అనంతరం ఈనెల 17న కౌటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి...
రాహుల్ పోరాటానికి మద్దతుగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష
అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్ దుష్ప్రచారం
Read Latest AP News And Telugu News