Share News

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. తెలంగాణ యువతకు లక్నో సంస్థ కుచ్చుటోపీ

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:33 AM

విదేశీ ఉద్యోగాల ఆశ చూపి తెలంగాణ యువతకు లక్నోకు చెందిన సంస్థ  కుచ్చుటోపీ పెట్టింది. రూ.1.28 కోట్లు వసూలు చేసి 'ఫెయిర్‌స్ట్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'  చేతులెత్తేసింది.

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. తెలంగాణ యువతకు లక్నో సంస్థ  కుచ్చుటోపీ
Overseas Job Fraud

హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): విదేశీ ఉద్యోగాల ఆశ చూపి తెలంగాణ యువతకు లక్నోకు చెందిన సంస్థ  కుచ్చుటోపీ పెట్టింది. రూ.1.28 కోట్లు వసూలు చేసి 'ఫెయిర్‌స్ట్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'  చేతులెత్తేసింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. లక్నో సంస్థతో పాటు ఇద్దరు కీలక అధికారులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. జర్మనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 2024లో టామ్‌కామ్‌తో లక్నో సంస్థ  ఒప్పందం కుదుర్చుకుంది.


67 మంది అభ్యర్థుల నుంచి రూ.1.28 కోట్లను లక్నో సంస్థ వసూలు చేసింది. జర్మన్ భాషలో B1 సర్టిఫికెట్ సాధించినా ఉద్యోగాలు దక్కలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  మొత్తం 67 మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ సంస్థ విదేశాల్లో ఉద్యోగం కల్పించింది. లక్నో సంస్థ టెక్నికల్ ఉద్యోగాలకు బదులు సేల్స్, రిటైల్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో ఇంటర్వ్యూలను నిర్వహించి మోసం చేసిందని బాధితులు తెలిపారు. కనీసం రీఫండ్ ప్లాన్ కూడా అమలు చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు లక్నో సంస్థపై కేసు నమోదు చేసి ఆధారాలను సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 11:19 AM