Share News

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేటీఆర్ ప్రశ్నలు.. కేంద్రం పనితీరుపై ఫైర్

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:49 AM

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ, భవిష్యత్తు విషయంలో పారదర్శకత ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేటీఆర్ ప్రశ్నలు.. కేంద్రం పనితీరుపై ఫైర్
ktr questioned central govt on privatisation

హైదరాబాద్, అక్టోబర్ 31: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణలో కేంద్రం పనితీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బ్యాంక్ ప్రైవేటీకరణలో కేంద్రం పారదర్శకతను పాటించడం లేదని ఆరోపించారు.


‘ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ సంపద. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఐడీబీఐ బ్యాంక్ విలువను తక్కువగా అంచనా వేస్తున్నారన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బిడ్లు రిజర్వ్ ధర కంటే తక్కువగా వచ్చినప్పుడు నిబంధనలు, వాల్యుయేషన్ విధానాలను ఎందుకు మార్చారు? హైదరాబాద్‌లోని విలువైన భూములతో పాటు ఐడీబీఐకి ఉన్న కీలకమైన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను పూర్తిస్థాయిలో లెక్కలోకి తీసుకున్నారా? ఐడీబీఐ ఉద్యోగులు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? గొప్ప పేరున్న ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేట్ సంస్థకు అప్పగించే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలి. పారదర్శకతను ఎందుకు పాటించడం లేదు? బ్యాంక్ ప్రైవేటీకరణలో ఇంత తొందర ఎందుకు?’ అని కేటీఆర్ నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 11:20 AM