Share News

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదు: కేటీఆర్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:53 PM

తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై ఆయన స్పందించారు.

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదు: కేటీఆర్‌
KTR

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పష్టం చేశారు. తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై ఆయన స్పందించారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’.. పేరుతో కార్యకలాపాలు చేపట్టవద్దని చెప్పారు.


తన పేరుతో ఎలాంటి సంస్థలకూ అనుమతి లేదని.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని.. తనపై అభిమానం ఉన్నవాళ్లు భారత రాష్ట్ర సమితితో కలిసి పని చేయొచ్చని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 06:10 PM