Share News

గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతి

ABN , Publish Date - Sep 16 , 2026 | 08:55 AM

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన జరిగింది. గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతిచెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతి
Hyderabad Woman incident

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన జరిగింది. గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతిచెందింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలోని ప్రైవేట్ ల్యాబ్‌లో రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతి పనిచేస్తోంది. స్నేహితుడి ద్వారా కృష్ణా జిల్లాకు చెందిన నాగసాయితో మృతురాలికి పరిచయం ఏర్పడింది. వీరి మధ్య ఐదు నెలల క్రితం ఏర్పడిన పరిచయం లైంగిక సంబంధానికి దారితీసినట్లు సమాచారం.


ఇటీవల గర్భం దాల్చడంతో యువతికి గర్భ నిరోధక మాత్రలను నాగసాయి ఇచ్చాడు. ఈ మాత్రలు వికటించడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆగస్టు 26వ తేదీన నిజాంపేట రోడ్డులోని ప్రైవేట్ ఆస్పత్రిలో స్నేహితులు చేర్పించారు. ఆ తర్వాత యువతి పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 1వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14వ తేదీన ఆమె మృతిచెందింది. అంతకు ముందే యువతి మామ ఫిర్యాదుతో ఆగస్టు 27వ తేదీన కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగసాయిని అరెస్ట్ చేసి సెప్టెంబర్ 9వ తేదీన రిమాండ్‌కు పోలీసులు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి

వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 09:04 AM