కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Jun 07 , 2026 | 03:42 PM
కార్పొరేట్ స్కూల్స్‌లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ కార్యాకలాపాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలర్ట్‌గా ఉండి యువతను కాపాడుకోవాలని సూచించారు.
హైదరాబాద్, జూన్7 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ స్కూల్స్‌లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ కార్యాకలాపాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలర్ట్‌గా ఉండి యువతను కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో డ్రగ్స్ కల్చర్ భారీగా పెరిగిందని పేర్కొన్నారు. తాను బస్తీలో పర్యటించడానికి వెళ్తే మహిళలు డ్రగ్స్ గురించి తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ వేదికగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువత మత్తుకు బానిసలు, నిర్వీర్యం అవుతున్నారని అన్నారు. నీవురుగప్పిన నిప్పుల, చాప కింద నీరులా డ్రగ్స్ పెరిగిపోతున్నాయని.. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. యువశక్తి నిర్వీర్యమైతే దేశానికి ప్రమాదకారమని అన్నారు. డ్రగ్స్ ద్వారా యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. యోగా చేయడం ద్వారా డ్రగ్స్ నుంచి బయట పడేయొచ్చని చెప్పారు.
సమాజాన్ని చైతన్యం చేయాలి..
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలని.. సమాజాన్ని చైతన్యం చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. 20వ తేదీన ఎల్బీస్టేడియంలో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. 21వ తేదీన ఆయా పాఠశాలల వద్ద విద్యార్థులతో కలసి యోగా చేయాలని పిలుపునిచ్చారు. 24వ తేదీన అవర్స్ యోగా డే కౌంట్‌డౌన్‌గా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ఐక్యరాజ్యసమితిలో యోగా గురించి ప్రతిపాదన చేశారని ప్రస్తావించారు. 170 దేశాలు ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేశాయని వెల్లడించారు. 225 దేశాలు యోగాడేను అధికారికంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.
యోగా ద్వారా ఆరోగ్యం..
ఆయా కార్పొరేట్ కంపెనీలు యోగా కోసం ఉద్యోగులు పని చేసే ప్రాంతాల్లోనే స్థలం కేటాయిస్తున్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. రోగం వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు చేస్తామని.. కానీ యోగా ద్వారా ఖర్చు లేకుండా ఆరోగ్యం వస్తుందని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు యోగా చేస్తే తెలివి తేటలు పెరుగుతాయని.. టీచర్లకు కూడా వారిలోని టాలెంట్ పెరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యోగా డే కార్యక్రమాలు నిర్వహించాలని కిషన్‌రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News