కేసీఆర్.. సింగరేణికి తీరని ద్రోహం చేశారు: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:30 PM
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఎన్‌టీపీసీకి బొగ్గు సరఫరా అవుతుందని తెలిపారు.
న్యూఢిల్లీ, జులై 27: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఎన్‌టీపీసీ(NTPC) కి బొగ్గు సరఫరా అవుతుందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణికి తీవ్ర నష్ట చేకూర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింగరేణి మెరుగుపడటం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం 49 శాతం, తెలంగాణ ప్రభుత్వం 51 శాతం వాటాతో సింగరేణి కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్.. సింగరేణికి తీరని ద్రోహం చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఆదాయానికి గత ప్రభుత్వం గండికొట్టిందని ఆరోపించారు. రాజకీయ వేదికలకు సింగరేణిని వాడుకున్నారంటూ బీఆర్‌ఎస్, కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
పరీక్షా విధానంలో సంస్కరణలకు.. హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్
విదేశీ యువతిపై అసభ్య ప్రవర్తన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కేసు
Read Latest Telangana News And Telugu News