ఏపీలో ‘మీ మార్ట్స్’.. ఎన్‌సీసీఎఫ్‌తో పౌరసరఫరాల శాఖ కీలక ఎంవోయూ
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:15 PM
ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్‌తో ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతి, జులై 27: ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్(NCCF)తో ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఢిల్లీలో పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు ఐఏఎస్, ఎన్‌సీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీస్ జోసెఫ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,000 ‘మీ మార్ట్స్’ ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు.
రేషన్ దుకాణాల ద్వారానే ‘మీ మార్ట్స్’ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మార్ట్స్‌లో 70 రకాల నాణ్యమైన వినియోగ వస్తువులు పోటీ ధరలకు విక్రయించనున్నారు. ప్రజలకు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరల్లో అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,000 ‘మీ మార్ట్స్’ ఏర్పాటు ద్వారా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
ఇవి కూడా చదవండి...
పోలవరం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
కృష్ణా జలాల్లో వాటాపై సుప్రీంకోర్టులో విచారణ.. కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం
Read Latest AP News And Telugu News