Share News

మనుమడు హిమాన్ష్‌‌ను పరామర్శించిన కేసీఆర్

ABN , Publish Date - Jul 07 , 2026 | 07:35 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు.

మనుమడు హిమాన్ష్‌‌ను పరామర్శించిన కేసీఆర్
KCR

హైదరాబాద్, జులై 7 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈరోజు (మంగళవారం) ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మనుమడు హిమాన్ష్‌ను (Himanshu) పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనతో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు హిమాన్ష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


కాగా, హిమాన్ష్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు, ముక్కుకు గాయమైనట్లు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

హిమాన్ష్ ఏమన్నారంటే..

‘నిన్న రాత్రి, క్రీడలకు సంబంధించిన గాయం కారణంగా నన్ను ఆస్పత్రిలో చేర్చారు. నా ఆరోగ్యం బాగానే ఉంది, కోలుకోవడానికి కొంత సమయం విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. మీ అందరి అవగాహనకు, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. త్వరలోనే నేను కోలుకోవాలని ఎదురుచూస్తున్నాను’ అని హిమాన్ష్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

స్మగ్లర్లపై కఠిన చర్యలు.. డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్

Read Latest Telangana News And And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:46 PM