కేబీఆర్ చుట్టూ వన్‌వే.. వాహనదారుల్లో గందరగోళం
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:12 PM
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు వన్‌వే అమలు చేయడంతో వాహనదారుల్లో గందరగోళం కొనసాగుతోంది. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. దారి తెలియక కొందరు రాంగ్ రూట్‌లోకి వెళ్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు వన్‌వే అమలు చేయడంతో వాహనదారుల్లో గందరగోళం కొనసాగుతోంది. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. దారి తెలియక కొందరు రాంగ్ రూట్‌లోకి వెళ్తున్నారు. కేబీఆర్ వన్‌వే ఎఫెక్ట్‌తో ఉదయం నుంచే ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని సైరన్లు, హారన్‌లతో వాహనదారులు హోరెత్తిస్తున్నారు.
వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్- 5 సిగ్నల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంకటగిరి పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్డు నంబర్- 5 సిగ్నల్ వరకు భారీగా ట్రాఫిక్ అయింది. రోడ్డు నంబర్-10-C నుంచి రోడ్డు నంబర్- 5 సిగ్నల్ వరకు వాహనాల రద్దీ కొనసాగుతోంది.
వన్ వే ట్రాఫిక్ అమలుతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. యూసుఫ్ గూడ, వెంకటగిరి నుంచి రోడ్డు నంబర్- 36, రోడ్డు నంబర్- 45కి వెళ్లేవారిని కేబీఆర్ పార్క్ వైపు ట్రాఫిక్ పోలీసులు పంపిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి పోవాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చెక్ పోస్ట్ వరకు వచ్చి... రాంగ్ రూట్లో మళ్లీ వెనక్కు తిరిగి బైకర్స్ వెళ్తున్నారు. రోడ్డు నంబర్- 36కు వెళ్లేవారు చెక్‌పోస్ట్ వరకు రాకుండా వెంకటగిరి జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్- 10, డైమండ్ హౌస్ ద్వారా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ తిరగాలని, సరైన సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని పోలీసులతో వాహనదారులు గొడవ పడుతున్నారు.
వార్తలు కూడా చదవండి...
22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News