నేను సీఎం కావాలని అనుకుంటున్నా.. ఆ పదవికి గౌరవం ముఖ్యం: కవిత
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:53 PM
తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యాఖ్యలు మరోసారి హీట్ పెంచాయి. సీఎం కావాలన్న తన ఆకాంక్షను బహిరంగంగా వెల్లడించిన ఆమె.. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హరీశ్‌రావు భార్య తనపై పోటీ చేస్తే స్వాగతిస్తానని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాజకీయాల్లో తన రాజకీయ లక్ష్యాలపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావాలని అనుకుంటున్నానని స్పష్టం చేసిన ఆమె.. ముఖ్యమంత్రి పదవి కేవలం అధికార హోదా కాదని, ఆ పదవికి గౌరవం, హుందాతనం ఎంతో ముఖ్యమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూ.. ఇకపై ‘తుగ్లక్ చర్యలు’ అని చెప్పాల్సిన అవసరం లేదని, ‘రేవంత్‌రెడ్డిలా ఉన్నావ్’ అంటే చాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. దమ్ముంటే హరీశ్‌రావు భార్య తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. తనపై ఎవరో ఒకరు పోటీ చేయడం తప్పదని, అవసరమని భావిస్తే హరీశ్‌రావు రాజకీయాలను పక్కనపెట్టి తన భార్యను రాజకీయాల్లోకి తీసుకురావచ్చని వ్యాఖ్యానించారు.
తాను గతంలో హరీశ్‌రావుపై పోటీ చేస్తానని చెప్పిన మాట వాస్తవమేనని కవిత గుర్తుచేశారు. అయితే.. ఇప్పుడు హరీశ్‌రావు భార్య తనపై పోటీచేస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. తనపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమే అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఘాటెక్కిన ఉల్లి.. నెల రోజుల్లోనే ఆకాశాన్నంటిన ధరలు
పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Read Latest AP News And Telangana News And International News And Telugu News