తెలంగాణలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:18 PM
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) రేపు (గురువారం) తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం 10:55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1:30 గంటల వరకు ఎయిమ్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2:45 నుంచి బీబీనగర్ ఎయిమ్స్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.
రేపు మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో నడ్డా కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5:10 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి తాజ్ డెక్కన్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు తాజ్ డెక్కన్‌లో మేధావులతో సమావేశం కానున్నారు. తాజ్ డెక్కన్ నుంచి 7:10 నిమిషాలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌నకు వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి జేపీ నడ్డా వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News