Share News

జీడిమెట్లలో విషాదం.. జ్యువెల్లరీ స్టోర్‌లో రసాయనం తాగి రెండేళ్ల పాప మృతి

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:17 PM

హైదరాబాద్ నగర పరిధిలోని జీడిమెట్లలో బంగారం కొనడానికి జ్యువెల్లరీ స్టోర్‌కు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. బంగారాన్ని పరిశీలించేందుకు ఉపయోగించే రసాయనాన్ని తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జీడిమెట్లలో విషాదం.. జ్యువెల్లరీ స్టోర్‌లో రసాయనం తాగి రెండేళ్ల పాప మృతి
two year old girl death in geedimetla

మేడ్చల్ మల్కాజ్‌గిరి, అక్టోబర్ 10: హైదరాబాద్ నగర పరిధిలోని జీడిమెట్లలో విషాదం నెలకొంది. పండగ వేళ తమ చిన్నారికి బంగారం కొనడానికి జ్యువెల్లరీ స్టోర్‌కు వెళ్లిన తల్లిదండ్రులకు శోకం మిగిలింది. తమ కుమార్తె మృతికి స్టోర్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటూ.. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు జ్యువెల్లరీ స్టోర్ ఎదుట ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..


పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గోపీకృష్ణ, జానకి దంపతులు హైదరాబాద్ నగర పరిధిలోని చింతల్‌లో నివాసముంటున్నారు. వీరికి రెండేళ్ల పాప మిషా ఉంది. పండుగ సందర్భంగా పాపకు బంగారం కొనుగోలు చేయడానికి వారు చిన్నారి మిషాతో కలిసి చింతల్‌లోని ఓ జ్యువెల్లరీ స్టోర్‌కు వెళ్లారు. తల్లిదండ్రులు ఆభరణాలు చూస్తుండగా.. చిన్నారి స్టోర్‌లో తిరుగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో చిన్నారి మిషా.. బంగారాన్ని పరిశీలించేందుకు ఉపయోగించే రసాయనాన్ని తాగింది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చిన్నారి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. గోల్డ్‌షాప్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు జ్యువెల్లరీ స్టోర్ ఎదుట ధర్నాకు దిగారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి

రహస్యంగా వైద్యం చేయించుకుంటున్న కేటీఆర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 01:17 PM