హైదరాబాద్ పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి హత్య
ABN , Publish Date - Jul 19 , 2026 | 07:51 AM
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మహ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్‌ను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు.
హైదరాబాద్, జులై 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మహ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్‌ను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కాలపత్తర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. హత్య అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ప్రాణం పోశారు: సీఎం రేవంత్‌రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు అరెస్ట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News