Share News

తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ప్రాణం పోశారు: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:48 AM

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ప్రాణం పోశారు: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జులై 18 (ఆంధ్రజ్యోతి): ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) నివాళి అర్పించారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఈ మేరకు సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ నేల ఆత్మను తన అక్షరాల్లో ఆవిష్కరించారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారని వ్యాఖ్యానించారు.


అందెశ్రీ ప్రతి గేయం ప్రజల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని సీఎం పేర్కొన్నారు. ఆయన సాహిత్యం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. స్వాభిమానానికి స్వరంగా తన రచనలు నిలిచాయని వెల్లడించారు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా అందెశ్రీ సాహిత్యం ఉంటుందని తెలిపారు. తెలంగాణపై ఆయన అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల పట్ల అందెశ్రీ నిబద్ధత మార్గదర్శకమని చెప్పారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం అందెశ్రీ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తాం: మంత్రి తుమ్మల

హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 08:01 AM