Share News

హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:10 PM

కొంతమంది హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్
Bandi Sanjay Kumar

హైదరాబాద్, జులై 16 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని పాతబస్తీ సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో రెండోతరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి హోమ్‌వర్క్‌లో కల్మా, సూరహ్ ఫాతిహా చదివి రావాలని స్కూల్ డైరీలో రాశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్రంగా ఖండించారు. కొంతమంది హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ధ్వజమెత్తారు.


సెక్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపట్లేదు..

ఈరోజు (గురువారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. కల్మా సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. సోకాల్డ్ సెక్యూలర్ సంఘాలు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? అని ప్రశ్నించారు. హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఈ విషయాన్ని ఖండించాలని అన్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే... తెలంగాణ అంతటా ఇదే సంస్కృతి విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందే..

ఆటోడ్రైవర్ భరత్‌ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? అని ప్రశ్నించారు. హిందువుల గురించి ఉర్దూలో ఆటోల్లో, గోడలపై రాసుకున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? అని నిలదీశారు. వాళ్లకో న్యాయం?, భరత్‌కు ఇంకో న్యాయమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. హిందూ విద్యార్ధులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

ఆస్తి వేలం వివాదం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:06 PM