Share News

ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్ల వీరంగం

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:04 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 ప్రాంతంలో బైక్ రేసర్ల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయని స్థానికులు తెలిపారు.

ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్ల వీరంగం
Uppal Bike Racing

హైదరాబాద్, జులై 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 ప్రాంతంలో బైక్ రేసర్ల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయని స్థానికులు తెలిపారు. డీ-మార్ట్ సమీపంలోని వాసవి మెట్రోపోలిస్ ఎదురుగా ఉన్న విశాలమైన రహదారులపై కొందరు యువకులు అత్యంత వేగంతో బైక్ రేసింగ్ చేస్తూ ప్రమాదకర స్టంట్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


సైలెన్సర్లు తొలగించిన బైక్‌లతో భారీ శబ్దాలు చేస్తూ రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ సమయంలోనే ఈ స్టంట్లు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, పాదచారులు ఈ చర్యలతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే బైక్ రేసర్లు తమ విన్యాసాలు ప్రదర్శించడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు పేర్కొన్నారు. విశాలమైన రహదారులను రేసింగ్ ట్రాక్‌లుగా మార్చుకుని నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని స్థానికులు డిమాండ్ చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా బైక్ రేసర్లను గుర్తించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలకు దారితీసే బైక్ రేసింగ్‌ను అరికట్టేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకర విన్యాసాలతో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 01:11 PM