Share News

రైళ్లలో ఆహార నాణ్యతపై డిజిటల్‌ పర్యవేక్షణ

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:55 AM

రైల్వే క్యాటరింగ్‌ యూనిట్లలో ఆహార నాణ్యతపై డిజిటల్‌ పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించింది.

రైళ్లలో ఆహార నాణ్యతపై డిజిటల్‌ పర్యవేక్షణ

  • మెరుగైన క్యాటరింగ్‌ సేవల కోసం క్యూసీఐతో ఐఆర్‌సీటీసీ ఎంవోయూ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రైల్వే క్యాటరింగ్‌ యూనిట్లలో ఆహార నాణ్యతపై డిజిటల్‌ పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించింది. ఈ మేరకు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ)తో తాజాగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని మొబైల్‌ (రైళ్లు), స్టాటిక్‌ (స్టేషన్‌) క్యాటరింగ్‌ యూనిట్లలో అత్యున్నత ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను నిర్ధారించేందుకు సాంకేతిక ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చే యనుంది.


ఎంవోయూలో భాగంగా క్యూసీఐ సర్టిఫైడ్‌ నిపుణులతో ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలను నిర్వహించనుంది. తనిఖీ అధికారులు జియో-ట్యాగింగ్‌, టైమ్‌-స్టాంపింగ్‌, ఫోటోగ్రాఫిక్‌ ఆధారాలతో కలిగిన ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ను ఉపయోగించనున్నట్లు తెలిసింది. ఈ తక్షణ ఆడిట్‌లతో ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిబంధనలు, అంతర్జాతీయ వంటకాల ప్రమాణాలను కఠినంగా అమలు చేసి, ప్రయాణికులకు అత్యుత్తమ భోజనం అందించాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:55 AM